Harithamithra Telugu News

Home Agricultue వ్యవసాయ వార్తలు రైతులకు అలర్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ బంద్.. ఆ తేదీల్లో సరుకు తీసుకురావద్దు!

రైతులకు అలర్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ బంద్.. ఆ తేదీల్లో సరుకు తీసుకురావద్దు!

0
Warangal Ennumamula Market Auction Timings 2026

హ‌రిత‌మిత్ర‌, వ‌రంగ‌ల్‌ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Agriculture Market) కమిటీ పరిధిలోని రైతులు, వ్యాపారస్తులు, కార్మికులకు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి శుక్ర‌వారం ఒక ముఖ్యమైన‌ ప్రకటన విడుదల చేశారు. మహాశివరాత్రి (Maha Shivaratri) పండుగ, ఇతర సెలవుల కారణంగా వరంగల్ మార్కెట్ యార్డుకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించారు.

సెలవుల వివరాలు:

మార్కెట్ కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ కింది తేదీల్లో లావాదేవీలు నిలిపివేయబడతాయి:

  • ఫిబ్రవరి 14, 2026 (శనివారం): వారాంతపు యార్డు బంద్.
  • ఫిబ్రవరి 15, 2026 (ఆదివారం): వారాంతపు సెలవు, మహా శివరాత్రి పండుగ.
  • ఫిబ్రవరి 16, 2026 (సోమవారం): శివరాత్రి మరుసటి రోజు జాగరణ సందర్భంగా మార్కెట్‌కు సెల‌వు
  • ఫిబ్రవరి 17, 2026 (మంగళవారం): అమావాస్య కార‌ణంగా మార్కెట్‌కు బంద్.

వరుసగా నాలుగు రోజుల సెలవుల అనంతరం, మార్కెట్ యార్డు తిరిగి ఫిబ్రవరి 18, 2026 (బుధవారం) రోజున యథావిధిగా ప్రారంభమవుతుంది. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి, పైన పేర్కొన్న బంద్ రోజులలో తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించి ఇబ్బందులకు గురికావద్దని మార్కెట్ కమిటీ కార్యదర్శి కోరారు. బుధవారం నుంచి విక్రయాల కోసం రైతులు తమ సరుకును తీసుకురావచ్చని తెలిపారు.


Previous articleYamaha EC-06 vs River Indie : ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ఫుల్? ధర, ఫీచర్ల తేడాలు ఇవే..
Next articleఎలక్ట్రిక్ బైక్‌పై భారత్ రికార్డు: 19 రోజుల్లో 7,530 కిలోమీటర్లు.. Raptee.HV T30 సంచలనం!
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here