Electric Bike | ఎప్పుడూ చూడని కొత్త స్టైల్ లో ఎలక్ట్రిక్ బైక్..
Creatara VS4, VM4 EV కాన్సెప్ట్‌లు విడుదల
EV స్టార్టప్ అయిన Creatara రెండు కాన్సెప్ట్‌లను ప్రదర్శించింది. VS4 మరియు VM4. ఇది సింగిల్ చార్జ్ పై 100కిమీ రేంజిని కలిగి ఉంది.ఐఐటీ ఢిల్లీకి చెందిన వికాస్ గుప్తా, రింగ్‌లరేయ్ పమీ స్థాపించిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన క్రియేటారా, ఐఐటీ ఢిల్లీలోని రీసెర్చ్ & ఇన్నోవేషన్ పార్క్‌లో తన వాహన కాన్సెప్ట్‌లు VS4, VM4లను ఆవిష్కరించింది. భద్రత, అధునాతన సాంకేతికత కలిగిన ఇ-స్కూటర్లు పట్టణ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తుందని కంపెనీ తెలిపింది.భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధిని సాధిస్తోంది. వార్షిక వృద్ధి రేటు 20% మించిపోయింది. ఎకనామిక్ సర్వే 2023 భారతదేశ దేశీయ EV మార్కెట్లో 2022 నుంచి 2030 మధ్య 49% CAGRని అంచనా వేసింది. 2030 నాటికి 10 మిలియన్ల వార్షిక అమ్మకాలు జరుగుతాయని అంచనాలు ఉన్నాయి.2030 నాటికి భారతదేశ వాహన సముద...