
మాంటిస్, అల్ట్రావయోలెట్, రోర్ ఇందులో ఏది బెస్ట్..
Electric bikes: ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ లోకి రోజురోజుకు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. తాజాగా ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్. 250సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదలైంది. మాంటిస్ ప్రారంభంతో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న అల్ట్రావయోలెట్ F77 తో పోటీ పడనుంది. 150cc నుంచి 250cc.. 500cc విభాగంలో ఓబెన్ రోర్, ఓర్క్సా మాంటిస్ తోపాటు ఎఫ్77 ప్రముఖ మోడళ్లుగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ బైక్ ల స్పెసిఫికేషన్లు, పోలికలు ఒకసారి చూద్దాం..
ఓర్క్సా మాంటిస్ (Orxa Mantis)
ఓర్క్సా మాంటిస్ మోటార్‌సైకిల్ యూత్ ను ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది. ఇది అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ చుట్టూ నిర్మించబడింది. టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు సింగిల్-ఛానల్ ABS, TFT డిస్‌ప్లే, ఫోన్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. భారతదేశం లో లిక్విడ్-కూల్డ్ మోటార్ కలిగిన మొదటి EV గా ఇది నిలిచింది.
ఒబెన్ రోర్ (Oben Rorr)
ఒబెన్ రోర్ 150cc సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని మాంటిస్ దిగువన ఉన్న విభాగంలో ఉంది. ఒబెన్ రోర్ ఒక సౌకర్యవంతమైన, ఇంకా స్పోర్టి రైడర్ ట్రయాంగిల్‌తో సాంప్రదాయ మోటార్‌సైకిల్ డిజైన్‌ను కలిగి ఉంది. Rorr టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుకవైపు మోనోషాక్, ఒక LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, రైడ్ మోడ్‌లు, కాంబి-బ్రేక్ సిస్టమ్‌తో రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. అంతేకాకుండా పోర్టబుల్ ఛార్జర్‌ను తీసుకువెళ్లడానికి అండర్-సీట్ స్టోరేజీని కూడా కలిగి ఉంది.
అల్ట్రా వయోలెట్ F77 (Ultraviolette F77)
అల్ట్రా వయోలెట్ F77.. ఇది చాలా వేగవంతమైంది.. ఈ సెగ్మెంట్ లో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. అత్యధిక శక్తిని అందిస్తుంది. ముందువైపు కాకుండా పూర్తి ఫెయిరింగ్‌ను కలిగి ఉంటుంది. F77 క్లిప్-ఆన్ బార్‌లు, ముందు భాగంలో అడ్జెస్టబుల్ చేయగల USD ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్, డ్యూయల్-ఛానల్ ABS, TFT డిస్‌ప్లే స్పోర్టీ రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉంది.
పోలిక కోసం, F77 బేస్ వేరియంట్ పరిగణనలోకి తీసుకోబడింది. ఇది మాంటిస్‌తో సమానంగా ఉంటుంది. ఈ మూడు ఎలక్ట్రిక్ బైక్ లలో F77 అత్యంత వేగవంతమైనది. అయితే Mantis ఎలక్ట్రిక్ బైక్ దాని ఫీఛర్లు డిజైన్ పరంగా Rorr బైక్ అలాగే అల్ట్రావయోలెట్ F77 బైక్ ల మధ్య స్థిరపడుతుంది.
Electric bikes and Specifications
[table id=9 /]
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..
Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.
👌👌👌👌👌