City Transformer | ఈ కారును ఈజీగా మడిచేసుకోవచ్చు.. ఇరుకైన స్థలంలోనూ పార్క్ చేయోచ్చు..
City Transformer | ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కంపెనీలు విభిన్నమైన ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మడిచేసుకోవడానికి వీలుగా ఉండే స్కూటర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అలాగే ఇజ్రాయెలీ స్టార్టప్ కంపెనీ కూడా ఏకంగా మడిచేసుకోవడానికి వీలయ్యే కారు (Foldable Electric Car ) ను మార్కెట్లో విడుదల చేసింది.ఇజ్రాయెలీ(Israel) స్టార్టప్ కంపెనీ 'సిటీ ట్రాన్స్ ఫార్మర్స్స మహా నగరాల్లో ప్రాంతాల్లోని ట్రాఫి క్ ను దృష్టిలో పెట్టుకుని 'సీటీ-2' పేరుతో ఈ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది. ఇందులోని ఫోల్డింగ్ మెకానిజం వల్ల ఈ కారు వీల్ బేస్ను పార్కింగ్ సమయంలో కుంచించుకునేలా చేయవచ్చు. ఇవి పార్కింగ్ ప్రదేశాల్లో తక్కువ వెడల్పు ఉన్న ప్రాంతంలోకి కూడా దూరిపోతాయి. ఇలా మడిచేస్తే, వీల్ బేస్ 4.6 అడుగుల నుంచి కేవలం 39 అంగుళాల వెడల్...