Delhi air pollution : ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం.. స్కూళ్లు బంద్, రైళ్లు, విమానాలు పరిమితం..
Delhi air pollution : ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఈరోజు ఉదయం కూడా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనితో కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) కఠినమైన కాలుష్య నిరోధక చర్యలను అమలు చేయాలని సూచించింది. CAQM తీవ్రమైన పొగమంచును "ఎపిసోడిక్ ఈవెంట్"గా వర్గీకరించింది.ఢిల్లీలోని ఆనంద్ విహార్ (441), ద్వారక (444), ముండ్కా (449), ఆర్‌కె పురం (437), ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (446) వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ ‘సివియర్’ జోన్‌లో కొనసాగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ గణాంకాలు ప్రచురించాయి.AQI 401-450 ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పుడు స్టేజ్ III చర్యలు వర్తిస్తాయి. I మరియు II స్టేజ్‌ల కింద ఇప్పటికే అమలు చేస్తున్న నిబంధనలకు అదనంగా కాలుష్య నిరోధక చర్యలను చేపట్టనున్నారు. GRAP గాలి నాణ్యతను నాలుగు దశలుగా వర్గీకరిస్తుంది: స్టేజ్ I (AQI 201-300) “...