Electric Bus | ఇప్పుడు భారత్ లో అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులు ఉన్న నగరం ఇదే..
Electric Bus | భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులను కలిగి ఉన్న మొదటి నగరంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా మూడవ నగరంగా న్యూఢిల్లీ అవతరించింది. ఈమేరకు మంగళవారం ఢిల్లీలో కొత్తగా 320 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి, నగరంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 1,970కి చేరుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల రాకపోకలతో ఢిల్లీ కాలుష్యంపై పోరాటానికి బలం చేకూరుస్తుందని బాన్సెరాలో జరిగిన ఫ్లాగ్-ఆఫ్ కార్యక్రమంలో వీకే సక్సేనా చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మేము 320 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్నాం. ఇవి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయి. రాబోయే కాలంలో, ఇటువంటి మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఢిల్లీలో కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉంటే, ప్రజా రవాణాను బలోపేతం చేయాలని నేను భావ...