Delhi air pollution Today |
Delhi air pollution Today | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత మరింత ప్రమాదక స్థాయికి చేరింది. రానున్న మరో ఆరు రోజుల పాటు గాలి నాణ్యత తీవ్రమైన (severe ) లేదా తీవ్రమైన + (severe+ ) కేటగిరీలోనే ఉంటుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తన రోజువారీ బులెటిన్‌లో అంచనా వేసింది.అంతకుముందు ఆదివారం, సాయంత్రం 4 గంటలకు సగటు వాయు నాణ్యత సూచిక (AQI) 441 (సివియర్ ), రాత్రి 7 గంటలకు 457కి దిగజారడంతో, కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) GRAP స్టేజ్ IV విధించింది. రాత్రి 10 గంటల సమయానికి, రాజధానిలోని అన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్‌లు, AQI రీడింగ్‌లు 400 కంటే ఎక్కువ ఉండటంతో తీవ్రమైన కాలుష్య స్థాయిలు కొనసాగినట్లు నివేదించాయి.గాలి నాణ్యతను మరింత దిగజారుతున్న తరుణంలో సోమవారం ఉదయం ఢిల్లీలో పబ్లిక్ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేసింది. అలాగే మరిన్ని కఠినమైన కాలుష్య ని...