Thursday, December 5Lend a hand to save the Planet
Shadow

Delhi air pollution Today |

Spread the love

Delhi air pollution Today | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత మరింత ప్రమాదక స్థాయికి చేరింది. రానున్న మరో ఆరు రోజుల పాటు గాలి నాణ్యత తీవ్రమైన (severe ) లేదా తీవ్రమైన + (severe+ ) కేటగిరీలోనే ఉంటుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తన రోజువారీ బులెటిన్‌లో అంచనా వేసింది.

అంతకుముందు ఆదివారం, సాయంత్రం 4 గంటలకు సగటు వాయు నాణ్యత సూచిక (AQI) 441 (సివియర్ ), రాత్రి 7 గంటలకు 457కి దిగజారడంతో, కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) GRAP స్టేజ్ IV విధించింది. రాత్రి 10 గంటల సమయానికి, రాజధానిలోని అన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్‌లు, AQI రీడింగ్‌లు 400 కంటే ఎక్కువ ఉండటంతో తీవ్రమైన కాలుష్య స్థాయిలు కొనసాగినట్లు నివేదించాయి.

గాలి నాణ్యతను మరింత దిగజారుతున్న తరుణంలో సోమవారం ఉదయం ఢిల్లీలో పబ్లిక్ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేసింది. అలాగే మరిన్ని కఠినమైన కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నారు. దట్టమైన, విషపూరితమైన పొగమంచు దృశ్యమానతను గణనీయంగా తగ్గిపోయింది. అధికారులు సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలో కేవలం 150 మీటర్ల విజిబిలిటీ ఉన్న‌ట్లు PTI నివేదించింది.

ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 484 నమోదైంది, ఈ సీజన్‌లో అత్యంత దారుణంగా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది. ఆదివారం AQI ఎక్కువగా ఉంది. సాయంత్రం 4 గంటలకు 441కి చేరుకుంది. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాత్రి 7 గంటలకు 457కి చేరుకుంది. AQI 450 దాటడంతో, ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఢిల్లీ-NCRలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్-IV పరిమితులను అమలు చేసింది. 400 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే AQI సివియ‌ర్ గా పరిగణిస్తారు. ఇది ఆరోగ్యవంతమైన వ్యక్తులు, ఇప్పటికే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న వ్యక్తులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ఇది ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని గాలి నాణ్యతను నాలుగు వేర్వేరు దశల్లో వర్గీకరించారు.

  • స్టేజ్ 1 – ‘పూర్’ (AQI 201-300),
  • స్టేజ్ 2 – వెరీ పూర్ (AQI 301-400),
  • స్టేజ్ 3 – సివియ‌ర్ (AQI 401-450)
  • స్టేజ్ 4 – సివియ‌ర్ ప్ల‌స్ (AQI 450 పైన ).

ఢిల్లీలో సాధారణం కంటే 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత 16.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడే అవకాశం ఉంది.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *