Ethanol 100 | ఐదు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ 100 ఫ్యూయల్.. కొత్త రకం పెట్రోల్ తో ఉపయోగాలు ఇవే..
Ethanol 100 : పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనమైన 'ఇథనాల్ 100' (E100)పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈమేరకు ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ (IOCL) అవుట్‌లెట్ లో 'ఇథనాల్ 100'ని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 12,000 అవుట్‌లెట్లలో ఈ-20 ఇంధనం అందుబాటులో ఉందన్నారు. IOCL కు చెందిన 183 రిటైల్ అవుట్‌లెట్‌లు ఇక నుంచి Ethanol 100 ని విక్రయిస్తాయి. ఏప్రిల్ 15 నాటికి, 400 అవుట్‌లెట్‌లు E100ని విక్రయిస్తాయి. గత 10 సంవత్సరాలలో, ఈ ఇథనాల్ వినియోగం ద్వారా రైతులకు అదనపు ఆదాయం పెరుగుతోందని, గ్రామీణ ఉపాధి మెరుగవుతోందని మంత్రి వెల్లడించారు. ఇథనాల్ వాడకంతో 1.75 కోట్ల చెట్లను నాటడానికి సమానమైన కార్బన్ డయాక్సైడ్ తగ్గింపు , రూ. 85,000 కోట్ల విలువైన విదేశీ మారకం ఆదా అయినట్లు వివరించారు.
E20 Petrol అంటే ఏమిటి?
1970లలో బ్రెజిల్‌లో మొట్టమొదటిసారి...