Eco Friendly Diwali 2023 : దీపావళికి మీ వంతుగా పర్యావరణ రక్షణ కోసం ఇలా చేయండి..
Eco Friendly Diwali 2023: దీపావళి పర్వదినాన్ని పర్యావరణ హితంగా జరుపుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. చిన్నచిన్న మార్పులను తీసుకొస్తే చాలు.. వీటిని అనుసరించి మీరు కూడా పర్యావరణానికి సాయం చేయండి. అవేంటో తెలుసుకోండి.Eco Friendly Diwali 2023: వెలుగుల పండుగ దీపావళి (Diwali ) మన అందరి జీవితాల్లో చీకట్లను పారదోలడానికి వచ్చేస్తోంది. దీపావళి అంటేనే పిల్లలు, యువత, బాణసంచా కాల్చడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ టపాసుల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుంది. పర్యావరణవేత్తలు కూడా ఇదే విషయమై తరచూ హెచ్చరిస్తుంటారు. దీపావళి పండుగ దీపాలు, బాణసంచాతో ముడిపడి ఉంటుంది. ఇవి వాయు, శబ్ద కాలుష్యానికి కారణమవుతుంది. గాలి కాలుష్యంతో ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ (COPD), ఇతర శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అయితే మీరూ ప్రకృతికి, పర్యావరణానికి మేలు చేసేలా దీపావళి జరుపుకోవాలని ఆలోచిస్తున్నారా? ఎకో ఫ్ర...