సింగిల్ చార్జిపై 120కి.మి రేంజ్
సరికొత్తగా EeVe Soul electric scooter
EeVe Soul electric scooter : భువనేశ్వర్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల స్టార్టప్, EeVe ఇండియా.. ఇటీవల తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వాహనం ఆవిష్కరణతో ఈ కంపెనీ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి ప్రవేశించినట్లైంది. కొత్త విడుదలైన EeVe సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ.1.40 లక్షలు. అయితే, ఈ ధరలో FAME II సబ్సిడీ అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు ఉంటాయా లేదా అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో దశీయ రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.
EeVe Soul electric scooter స్పెసిఫికేషన్లు
కొత్త EeVe సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ సీటు కింద 2.2kWh రెండు అధునాతన లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలను పొందుపరిచారు. ఈ బ్యాటరీలను స్కూటర్ నుంచి విడదీసి చ...