Electric Metro Express : హైదరాబాద్ రోడ్లపై కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు..
New Electric Metro Express Buses Launching : హైదరాబాద్ వాసులుకు శుభవార్త. రణగొన ధ్వనులు, ఊపిరి సలపని పొగకు కారణమయ్యే డీజిల్ బస్సుల స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. TSRTC కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar), రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( komatireddy Venkatreddy), ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు మంగళవారం జెండా ఊపి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల స్థానంలో కొత్తగా 500 బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని వారు చెప్పారు.
అద్దె ప్రతిపాదికన 500 ఏసీ బస్సులు
అద్దె ప్రతిపాదికన 500 ఎయిర్ కండిషన్డ్ బస్సులను ఆగస్...