ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు
Cotton Farmers | హైదరాబాద్ : పత్తి రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ సేవలను ప్రారంభించింది. వాట్సప్ నంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సన్నద్ధమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే…