ఎలక్రిక్ వాహనాలు కొనడానికి ఇదే సమయం
జూన్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్..
రూ.35వేల వరకు ఆదా చేసుకోండిభారతదేశంలో కొన్నాళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే వీటి నిర్వహణ చాలా తక్కువ. అందుకే వినియోగదారులు వీటిపై మొగ్గు చూపడం ఇటీవల ఎక్కువైంది. అయితే జూన్ 1, 2023 నుంచి EVలు ఖరీదు కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై FAME 2 సబ్సిడీ మొత్తాన్ని తగ్గించేందుకు సిద్ధమైంది. ఇది సహజంగా అన్ని ఈవీలకు వర్తించనుంది. ఫలితంగా ప్రస్తుతం ఓలా, ఏథర్, బజాజ్ చేతక్, TVS iQube లేదా మరేదైనా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ. 35,000 వరకు ఆదా చేయవచ్చు.అసలు FAME 2 సబ్సిడీ ఏంటీ?
పర్యావరణ అనుకూల వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను ప్రోత్సహించడానికి FAME (Faster Adoption and Manufacturing of Electric and Hybrid Vehicles in India) పథకాన్ని కేంద్రం తొలిసారి 2015...