Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

ఎలక్రిక్ వాహనాలు కొనడానికి ఇదే సమయం

Spread the love

భారతదేశంలో కొన్నాళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే వీటి నిర్వహణ చాలా తక్కువ. అందుకే వినియోగదారులు వీటిపై మొగ్గు చూపడం ఇటీవల ఎక్కువైంది. అయితే జూన్ 1, 2023 నుంచి EVలు ఖరీదు కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై FAME 2 సబ్సిడీ మొత్తాన్ని తగ్గించేందుకు సిద్ధమైంది. ఇది సహజంగా అన్ని ఈవీలకు వర్తించనుంది. ఫలితంగా ప్రస్తుతం ఓలా, ఏథర్, బజాజ్ చేతక్, TVS iQube లేదా మరేదైనా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధరలు ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ. 35,000 వరకు ఆదా చేయవచ్చు.

hero-electric-optima-cx

అసలు FAME 2 సబ్సిడీ ఏంటీ?

పర్యావరణ అనుకూల వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను ప్రోత్సహించడానికి FAME (Faster Adoption and Manufacturing of Electric and Hybrid Vehicles in India)  పథకాన్ని కేంద్రం తొలిసారి 2015లో ప్రవేశపెట్టింది. దీని రెండో దశ ఏప్రిల్ 1, 2019న ప్రారంభించింది. మొదట్లో మార్చి 2022 వరకు చెల్లుబాటులో ఉంది.. అది ఇప్పుడు మార్చి 31, 2024 వరకు పొడిగించింది.

FAME 2 పథకం కింద ప్రభుత్వం సబ్సిడీల రూపంలో రూ. 10,000 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్‌ను పెంచేందుకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రోత్సాహకాన్ని ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీ kWhకి రూ. 10,000 నుంచి రూ. 15,000కి పెంచింది. ఇది మొత్తం ఎలక్ట్రిక్ వాహనం ధరలో 20 శాతం నుండి 40 శాతం ఉండేది. ఫేమ్ సబ్సిడీ ఫలితంగా ఒక్క ఎలక్ట్రిక్ వాహనం ధర 40వేలకు తగ్గింది. ఇది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమకు ఎంతో బూస్టింగ్ ఇచ్చింది.

అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై అందించే FAME సబ్సిడీ ఈ ఏడాది జూన్ 1 నుండి kWhకి ప్రస్తుతం ఉన్న రూ.15,000 నుండి రూ. 10,000కి తగ్గించింది. అంతేకాకుండా, సబ్సిడీపై గరిష్ట పరిమితి 15కి తగ్గించింది. ఫలితంగా ఈవీ ధరలు భారీగా పెరగనున్నాయి.

ధరలు పెరుగుతున్నయ్..

ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, బజాజ్ ఆటో వంటి అనేక EV కంపెనీలు వచ్చే నెలలో తమ ఉత్పత్తుల ధరలను పెంచుతామని ఇప్పటికే ప్రకటించాయి. ఇతర కంపెనీలు కూడా అదే బాట పట్టనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర అనేది వాహనం మోడల్ ఆధారంగా రూ. 25,000 నుండి రూ. 35,000 వరకు పెరగనుంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్రస్తుత ధరలు మే 31, 2023 వరకే చెల్లుబాటవుతాయి. Electric two-wheelers prices
ఏథర్ 450X ప్రస్తుతం ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధర రూ.98,079 నుంచి రూ.1.28 లక్షల వరకు ఉంది. బజాజ్ చేతక్ ఎక్స్-షోరూమ్ రూ.1.22 లక్షల నుంచి రూ.1.52 లక్షల వరకు ఉంది. TVS iQube ఆన్-రోడ్ ఢిల్లీ ధర రూ.1.06 లక్షలు. Ola Electric S1 ఎయిర్ వేరియంట్ ధర రూ. 84,999 నుంచి రూ.1.10 లక్షల వరకు ఉండగా, S1, S1 ప్రోల ధరలు వరుసగా రూ. 1.15 లక్షలు. రూ. 1.25 లక్షలుగా ఉంది.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *