ElectriExpo 2024 | హైదరాబాద్ లో ఆగస్టు 29 నుంచి ఎలక్ట్రిఎక్స్‌పో 2024
ElectriExpo 2024 | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (SETA) 100కి పైగా ఎలక్ట్రిక్ బ్రాండ్‌లను ఒకే గొడగు కిందకు తీసుకు వచ్చింది. 'పవరింగ్ ప్రోగ్రెస్-పయనీరింగ్ టుమారో: ఇగ్నైటింగ్ ఛేంజ్' థీమ్‌తో ఆగస్టు 29 నుంచి 31 వరకు ఎలక్ట్రిఎక్స్‌పో 2024ను నిర్వహించేందుకు సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (SETA) సన్నాహాలు చేస్తోంది.SETA నిర్వహిస్తున్న ఈ ఎలక్ట్రిఎక్స్‌పో 2024.. ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, పరికరాల కు సంబంధించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రదర్శన కావడంతో, ఇందులో ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యార్థులు, ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లు, ఇతరులతో సహా 30,000 మంది పాల్గొనే అవకాశం ఉంది.“ElectriExpo 2024 ప్రధానంగా ఇంధన ఆదా, విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, గాడ్జెట్‌లు, ఉపకరణాలపై దృష్టి పెడుతుంది. వివిధ పరిశ్రమల నిపుణులచే టెక్ సె...