Home » ElectriExpo 2024 | హైదరాబాద్ లో ఆగస్టు 29 నుంచి ఎలక్ట్రిఎక్స్‌పో 2024

ElectriExpo 2024 | హైదరాబాద్ లో ఆగస్టు 29 నుంచి ఎలక్ట్రిఎక్స్‌పో 2024

ElectriExpo 2024
Spread the love

ElectriExpo 2024 | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (SETA) 100కి పైగా ఎలక్ట్రిక్ బ్రాండ్‌లను ఒకే గొడ‌గు కింద‌కు తీసుకు వ‌చ్చింది. ‘పవరింగ్ ప్రోగ్రెస్-పయనీరింగ్ టుమారో: ఇగ్నైటింగ్ ఛేంజ్’ థీమ్‌తో ఆగస్టు 29 నుంచి 31 వరకు ఎలక్ట్రిఎక్స్‌పో 2024ను నిర్వహించేందుకు సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (SETA) స‌న్నాహాలు చేస్తోంది.SETA నిర్వ‌హిస్తున్న‌ ఈ ఎలక్ట్రిఎక్స్‌పో 2024.. ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, పరికరాల కు సంబంధించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రదర్శన కావడంతో, ఇందులో ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యార్థులు, ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లు, ఇతరులతో సహా 30,000 మంది పాల్గొనే అవకాశం ఉంది.

“ElectriExpo 2024 ప్రధానంగా ఇంధన ఆదా, విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, గాడ్జెట్‌లు, ఉపకరణాలపై దృష్టి పెడుతుంది. వివిధ పరిశ్రమల నిపుణులచే టెక్ సెమినార్‌లను నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. దీనికి ప్రఖ్యాత రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్‌లు కూడా హాజరవుతారని ప్రెసిడెంట్ సురేష్ జైన్ అన్నారు. మూడు రోజుల ఎగ్జిబిషన్‌లో Polycab, Fybros, KEI, Orbit, ఇతర బ్రాండ్‌ల ద్వారా వివిధ రకాల శక్తి-సమర్థవంతమైన విద్యుత్ పరికరాలను కూడా ప్రదర్శించ‌నున్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *