Air pollution | ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైనది.. ఢిల్లీ కంటే 6 రెట్లు అధ్వాన్నంగా..
Air pollution | చలికాలంలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. అయితే ఢిల్లీ కంటే ఆరు రెట్లు అధ్వాన్నంగా ఉన్న మరో నగరం తెరపైకి వచ్చింది. ఇది పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాలలో ఒకటైన లాహోర్ (Lahore)ఈ ఘనతను మూటగట్టుకుంది. దీని వాయు నాణ్యత సూచిక (Air Quality Index ) ఆదివారం 1,900 వద్ద ఉంది.14 మిలియన్ల జనాభా ఉన్న లాహోర్ నగరంలో AQI ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితి కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంది. ఇక్కడ కాలుష్యం విపరీతంగా పెరగడంతో పాకిస్తాన్ ప్రభుత్వం పాఠశాలలను మూసివేయడం, వర్క్ ఫ్రం హోం ఆదేశాలను జారీ చేయడం వంటి అత్యవసర చర్యలకు ఉపక్రమించింది.ప్రాణాంతక PM2.5 కాలుష్య కారకాల స్థాయి -- ఆరోగ్యానికి అత్యంత హాని కలిగించే గాలిలోని సూక్ష్మ కణాల స్థాయి 610కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో 15 పరిమితి కంటే 40 రెట్లు ఎక్కువగా ఉంది.లాహోర్‌లో, నగరవాసులు ఇంటి లోపలే ఉండాలని,...