Green Buildings | గ్రీన్ బిల్డింగ్స్ అంటే ఏమిటీ? దేశంలో వీటికి ఇస్తున్న ప్రోత్సాహకాలేంటీ..?
ఆరోగ్యంతోపాటు ఆహ్లాదకరం.. పర్యావరణ హితం
వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్ తో భారీ భవన నిర్మాణాలుGreen Buildings | హైదరాబాద్ : భారీ భవంతులు, అపార్ట్ మెంట్లతో కాంక్రీట్ జంగిల్ లా అంతరించిన మహా నగరాల్లో.. కొన్నిచోట్ల చూడ్డానికి పచ్చని చెట్టు కూడా కనిపించదు.. నిలబడానికి కాస్త నీడ కూడా దొరకదు.. అయితే ఉన్నంత స్థలంలో చిన్నచిన్న మొక్కలు, చెట్లు పెంచుకునేందు ప్రజలు ముందుకు వస్తున్నారు. మిద్దెతోటకు, టెర్రస్ గార్డెన్ పేరుతో మొక్కలు పెంచుకొని మురిసిపోతున్నారు. వీటితో ఆరోగ్యంతోపాటు ఆహ్లాదానికి పెద్దపీట వేస్తున్నారు. నగరవాసులు అభిరుచిమేరకు హరిత భవనాలు కూడా మన హైదరాబాద్ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. కొత్తగా విస్తరిస్తున్న వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్ లు అందర్నీ బాగా ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలువురు బిల్డర్లు సికింద్రాబాద్ లోని పద్మారావునగర్ తోపాటు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ తెల్లాపూ...