EV Subsidy Scheme | గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.10,900 కోట్ల వరకు సబ్సిడీ పథకం
EV Subsidy Scheme | న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు, కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10,900 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ పథకం, PM E-డ్రైవ్ ను ప్రకటించింది.ఈ కొత్త పథకం ద్వారా కేంద్రం ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సుల స్వీకరణపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు సబ్సిడీలను స్వల్పంగా తగ్గించింది. PM E-డ్రైవ్ పథకం 14,028 ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాలను పెంచేందుకు ప్రోత్సాహకాలను ఇస్తుంది. తొమ్మిది ప్రధాన నగరాల్లో కన్వర్జెన్స్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (CESL) స్టార్-రన్ కంపెనీ ద్వారా నిర్వహించనున్నారు. మొత్తం ₹ 4,391 కోట్ల వ్యయంతో ప్రతి బస్సుకు బ్యాటరీ సామర్థ్యం కోసం kwhకి ₹ 10,000 సబ్సిడీ ఇవ్వనుంది. ఈ-డ్రైవ్ పథకం విస్తృతమైన ఛార్జింగ్ ఇన...