EV Subsidy Scheme | న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు, కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10,900 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ పథకం, PM E-డ్రైవ్ ను ప్రకటించింది.
ఈ కొత్త పథకం ద్వారా కేంద్రం ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సుల స్వీకరణపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు సబ్సిడీలను స్వల్పంగా తగ్గించింది. PM E-డ్రైవ్ పథకం 14,028 ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాలను పెంచేందుకు ప్రోత్సాహకాలను ఇస్తుంది. తొమ్మిది ప్రధాన నగరాల్లో కన్వర్జెన్స్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (CESL) స్టార్-రన్ కంపెనీ ద్వారా నిర్వహించనున్నారు. మొత్తం ₹ 4,391 కోట్ల వ్యయంతో ప్రతి బస్సుకు బ్యాటరీ సామర్థ్యం కోసం kwhకి ₹ 10,000 సబ్సిడీ ఇవ్వనుంది. ఈ-డ్రైవ్ పథకం విస్తృతమైన ఛార్జింగ్ ఇన్ స్టలేషన్ అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టింది.
EV Subsidy Scheme ఎలక్ట్రిక్ బస్సులు కాకుండా.. 2.48 మిలియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 316,000 ఎలక్ట్రిక్ త్రీవీలర్లకు సబ్సిడీ ఇవ్వడానికి ₹ 2,679 కోట్లు కేటాయించింది. అదనంగా, ఎలక్ట్రిక్ ట్రక్కులు, హైబ్రిడ్ అంబులెన్స్‌ల కోసం ₹ 500 కోట్ల చొప్పున కేటాయించింది. కాగా “అంబులెన్స్‌ల కోసం, హైబ్రిడ్ వాహనాలకు ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నామని కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ క్యాబినెట్ బ్రీఫింగ్‌లో తెలిపారు.
ట్రక్కుల కోసం, రహదారి మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఆమోదిత వాహన స్క్రాపింగ్ కేంద్రాల నుంచి స్క్రాపింగ్ సర్టిఫికేట్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం ప్రోత్సాహకాలను అందిస్తుంది. FAME-II ఎలక్ట్రిక్ క్యాబ్‌లకు ప్రోత్సాహకాలను పొడిగించినప్పటికీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) దానిని ఈసారి భర్తీ చేయలేదు. E-డ్రైవ్ పథకం పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లకు వర్తింపజేయలేదు. దీంతో కొత్త పథకంలో ఎలక్ట్రిక్ క్యాబ్‌లకు రాయితీ ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేసిన దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ లిమిటెడ్‌కు చుక్కెదురైంది.
చార్జింగ్ సౌకర్యాలకు ప్రోత్సాహం..
ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కూడా పెద్ద ప్రోత్సాహాన్ని అందుకుంటుంది, ఎలక్ట్రిక్ -ఫోర్-వీలర్‌లకు 22,100 ఫాస్ట్ ఛార్జర్‌లు, ఇ-బస్సుల కోసం 1800 ఫాస్ట్ ఛార్జర్‌లు, ఎలక్ట్రిక్ -టూ-వీలర్స్, త్రీ-వీలర్‌ల కోసం 48,400 ఫాస్ట్ ఛార్జర్‌ల ఇన్‌స్టాలేషన్‌కు మద్దతుగా ₹ 2,000 కోట్లను కేటాయించింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..