విస్తరణ దిశగా HOP Electric Mobility
రాజస్థాన్‌కు చెందిన Electric Vehicles (EV) తయారీ సంస్థ HOP Electric Mobility లియో (HOP LEO), హాప్ లైఫ్ (HOP LYF) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. హాప్ ఎలక్ట్రిక్ 2021 జూన్ లో లియో, లైఫ్ ఇ-స్కూటర్లను విడుదల చేసింది. ఇవి రెండూ కూడా ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తాయి. ఇవి 72 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తాయి. వీటిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 125 కి.మీ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇందులో హాప్ లియో స్కూటర్ ధర రూ. 72,500, కాగా హాప్ లైఫ్ స్కూటర్ ధర రూ. 65,000 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్).
గంటకు 50కి.మి స్పీడ్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. వీటిలో 19.5 లీటర్ల బూట్ స్పేస్, ఇంటర్నెట్, జిపిఎస్, మొబైల్ యాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్లు 180 కిలోల లోడింగ్ సోమర్థ్యాన్ని కలిగి ఉం...