Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!
Free Solar Power | సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి కూడా కీలక ప్రకటన చేశారు. 22 గ్రామాలకు ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా సోలార్ విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. ఫైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిపోతోంది.ఈ క్రమంలో విద్యుత్ కొరత తలెత్తకుండా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్...