Gogoro electric scooter : 111కి. మీ. రేంజ్ తో గొగోరో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్..
Gogoro electric scooter: తైవానీస్ టెక్నాలజీ సంస్థ గొగోరో (Gogoro) భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడం ద్వారా అధికారికంగా ev market లోకి అడుగు పెట్టింది. క్రాస్‌ఓవర్ (Crossover)అని పేరు పెట్టబడిన ఈ స్కూటర్ మొదట్లో బి2బి సెగ్మెంట్‌ను ప్రత్యేకంగా లాస్ట్ మైల్ సర్వీసుల కోసం అందిస్తుంది. స్కూటర్‌ల SUVగా పేర్కొనబడిన గొగోరా ఆసక్తికరంగా ఇంకా క్రాస్‌ఓవర్ ధరలను ప్రకటించలేదు..
గొగోరో swapping stations
Gogoro Crossover launched : కొత్త ఇ-స్కూటర్‌తో పాటు, EV బ్రాండ్ దాని బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లను కూడా ఆవిష్కరించింది. వీటిని దశల వారీగా దేశవ్యాప్తంగా ఇన్‌స్టాల్ చేస్తారు. మొదట ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ, గోవాలో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుంది. 2024 ప్రథమార్థంలో ముంబై పూణేలకు లభ్యత మరింత విస్తరించబడుతుంది.మహారాష్ట్రలోని ఔ...