New EV Policy | ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే తెలంగాణలో కొత్తగా ఈవీ పాలసీ..
New EV Policy | రాష్ట్రంలో పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేందుకు కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. ఇది రేపటి నుంచే అమలులోకి రానుంది. ప్రభుత్వ ఉత్తర్వు (GO) 41 కింద తెలంగాణ తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానాన్ని రేపటి నుండి ప్రారంభించనుంది. ఈ చొరవలో భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది.కొత్త ఈవీ పాలసీ గురించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. . "మేము హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నాం. హైదరాబాద్ లో ఢిల్లీ లో మాదిరిగా కాలుష్య సమస్యలు ఉత్పన్నం కాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నాము. సాంప్రదాయ ఇంధన ఆధారిత...