Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: haritha mithra

Ather Energy ‘s 17th experience centre

Ather Energy ‘s 17th experience centre

E-scooters
Ather Energy తన 17వ ఎక్స్‌పీరియ‌న్స్ కేంద్రాన్ని గోవాలో ప్రారంభించింది. ఏథర్ ఎనర్జీ తన కొత్త రిటైల్ అవుట్‌లెట్ - ఏథర్ స్పేస్, పోర్వోరిమ్, పిలెర్నే, గోవాలో ఈవీర్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఇటీవల ప్రారంభించింది.ఇందులో ఏథర్ 450X , 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్ట్ రైడ్‌లు చేసుకోవ‌చ్చు. అలాగే కొనుగోలు చేయ‌డానికి ఏథర్ స్పేస్‌లో స్కూట‌ర్లు అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని సందర్శించే ముందు కస్టమర్‌లు ఏథర్ ఎనర్జీ వెబ్‌సైట్‌లో టెస్ట్ రైడ్ స్లాట్‌లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ఏడాది ప్రారంభంలో ముంబై, పుణె, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, జైపూర్, తిరుచ్చి, విశాఖపట్నం, కోజికోడ్, ఇండోర్, నాసిక్ వంటి పలు నగరాల్లో కంపెనీ తన ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది.Ather Energy రెండు ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ చేసింది. ఇవి నగరంలో పోర్వోరిమ్, పంజ...
అందుబాటు ధ‌ర‌లో Montra Electric Cycle

అందుబాటు ధ‌ర‌లో Montra Electric Cycle

Electric cycles
Montra Electric Cycle విడుద‌ల‌ ధర రూ .27,279. కిలోమీట‌ర్‌కు 7పైస‌లే..TI సైకిల్స్ ఆఫ్ ఇండియా త‌న తొలి ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను ఆవిష్క‌రించింది. Montra Electric Cycle పేరుతోతో విడుద‌లైన ఈ సైకిల్ త‌క్కువ దూరంలో ప్ర‌యాణించ‌డానికి చాలా అనుకూల‌మైన‌ది. మాంట్రా E- సైకిల్ ధ‌ర రూ .27,279 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది రోజువారీ ప్రయాణానికి స‌రిపోతుంది. తేలికైన అల్లాయ్ ఫ్రేమ్‌ Montra Electric Cycle తేలికైన అల్లాయ్ ఫ్రేమ్‌తో నిర్మించారు. ఇది చూడ‌డానికి ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఇందులో డ్యూయల్-మోడ్ ఉంటుంది. అంటే వినియోగ‌దారుడి సౌలభ్యం ప్ర‌కారం పెడ‌ల్ సాయంతో సైకిల్‌ను న‌డ‌ప‌వ‌చ్చు. అదేవిధంగా ఎల‌క్ట్రిక్ మోడ్‌లోనూ ముందుకెళ్ల‌వ‌చ్చు.  ఇందులో ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించడం వ‌ల్ల బ్రేకులు వేసేటప్పుడు మోటార్ పవర్ తగ్గిపోకుండా ఉంటుంది.  ఇది సమర్థవంతమైన, మృదువైన బ్రేకింగ్ సిస్టంను అందిస్తుంది.మాంట్...
eBikeGo హైస్పీడ్ స్కూట‌ర్ వ‌చ్చేసింది..

eBikeGo హైస్పీడ్ స్కూట‌ర్ వ‌చ్చేసింది..

E-scooters
eBikeGo సంస్థ రగ్డ్ ఎలక్ట్రిక్ 'మోటో-స్కూటర్' ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ స్కూట‌ర్ ప్రారంభ ధ‌ర రూ .79,999. ప్రభుత్వ సబ్సిడీలను వర్తింపజేసిన తర్వాత ధర తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. వాహ‌న‌ డెలివరీలు నవంబరు 2021 లో ప్రారంభం కానున్నాయి. టాప్ స్పీడ్ 70కి.మి eBikeGo ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ లొ 3kW మోటార్‌ను పొందుప‌రిచారు. ఇది గంట‌కు 70 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. ఇది రెండు వెర్షన్‌లలో అందుబాటులొ ఉంటుంది. అవి G1 మరియు G1+, ఎక్స్ షోరూం ధరలు వ‌రుస‌గా రూ. 79,999 మరియు రూ .99,999.అయితే ఈ ఎక్స్-షోరూమ్ ధ‌ర‌ల్లో FAME II సబ్సిడీ, కానీ రాష్ట్ర సబ్సిడీ చేర్చబడలేదు. eBikeGo రగ్డ్ ఎల‌క్ట్ర‌క్ స్కూట‌ర్ కోసం ప్రీ-బుకింగ్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో www.rugged.bike ప్రారంభించబడ్డాయి. ముందుగా రూ .499 చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చు. సింగిల్ చార్జిపై 160కి.మి రేంజ్‌ ఇది డిటాచ‌బుల్ బ్యాట‌రీలు 2 ...
మూడు చ‌క్రాల Tunwal Three Wheeler Electric Scooter

మూడు చ‌క్రాల Tunwal Three Wheeler Electric Scooter

E-scooters
దివ్యాంగులు, వృద్ధుల కోసం Tunwal Three Wheeler Electric Scooter స్టార్మ్ అడ్వాన్స్ డ్యూయల్ సీటర్ మోడ‌ల్ ఓవ‌ర్‌వ్యూతున్వాల్ సంస్థ కొన్నాళ్ల కింద‌ట ప్ర‌యోగాత్మ‌కంగా  స్టోర్మ్ అడ్వాన్స్ 1, స్టోర్మ్ అడ్వాన్స్ 2 పేరుతో రెండు డబుల్ సీట్ Tunwal Three Wheeler Electric Scooter లను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది.  రెండు సీట్ల‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు సౌకర్యవంతంగా కూర్చోవ‌చ్చు. ఈ స్కూట‌ర్  దివ్యాంగుల కోసం ప్ర‌త్యేకంగా తయారు చేయబడింది.  ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడ‌డానికి సింగిల్ సీటర్ మోడల్ మాదిరిగా కనిపిస్తుంది. డ్రైవర్ కోసం పెద్ద లెగ్ స్సేస్ ఉంటుంది.  ఈ ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది అలాగే వెనుక భాగంలో అడ్జ‌స్ట‌బుల్ సస్పెన్షన్‌తో అనుసంధానించబడి ఉంది. ఇందులో డ్రైవ‌ర్ సీటును అడ్జ‌స్ట్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించ‌డం విశేషం. డ్రైవ‌ర్‌కు అనుకూలంగా సీటు ఎత్తు ను కూడా పెంచుకో...
ప్ర‌పంచంలోనే అత్య‌ధిక రేంజ్‌తో Simple One electric scooter

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక రేంజ్‌తో Simple One electric scooter

E-scooters
దేశ స్వాంత్ర్య దినోత్స‌వం రోజున వాహ‌న రంగంలో రెండు అద్భుత ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రిగాయి.  అందులో ఒక‌టి ఓలా ఎల‌క్ట్రిక్ సంస్థ ఓలా ఎస్‌1, ఓలా ఎస్ 1 ప్రో ఈ-స్కూట‌ర్ల‌ను విడుద‌ల చేయ‌గా..  సింపుల్ ఎన‌ర్జీ కంపెనీ Simple One electric scooter ను లాంచ్ చేసింది.  ఈ రెండు స్కూట‌ర్‌లు అంచ‌నాల‌కు మించి అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ముందుకు వ‌చ్చాయి.  టాప్ స్పీడ్‌, రేంజ్ విష‌యంలో ఓలా కంటే సింపుల్ వ‌న్ స్కూట‌ర్ పైచేయి సాధించింది.బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ సింపుల్ ఎనర్జీ త‌న మొట్టమొదటి ప్రోడ‌క్ట్ అయిన Simple One electric scooter ను ఆగ‌స్టు 15న ప్రారంభించింది.  దీని ధర రూ .1,09,999 (ఎక్స్-షోరూమ్, FAME II సబ్సిడీకి ముందు).  ఎలక్ట్రిక్ స్కూటర్ వ‌చ్చే రెండు నెలల్లో 13 రాష్ట్రాల్లోని 75 నగరాల్లో అందుబాటులో ఉంటుందని సింపుల్ ఎన‌ర్జీ సంస్థ పేర్కొంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ఈ స్కూట‌ర్ రేంజ్ ఇప్ప‌టిర‌కు అత్య‌ధిక...
ఓలా.. అదిరిపోలా..

ఓలా.. అదిరిపోలా..

E-scooters
క‌నీవినీ ఎరుగ‌ని ఫీచ‌ర్ల‌తో ola electric s1. s1 pro ఈ స్కూట‌ర్‌లో పాట‌లువినొచ్చు.. కాల్స్ మాట్లాడొచ్చు..ola electric s1. s1 pro.. ఎన్నో రోజుగా ఊరిస్తున్న ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. ఎట్ట‌కేల‌కు అట్ట‌హాసంగా లాంచ్ అయింది. స్టైలిష్ బాడీ.. అదిరిపోయే అత్యాదునిక స్మార్ట్ ఫీచ‌ర్లు క‌లిగిన ఈ హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కోసం దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూశారు.ఎట్టకేలకు భారతదేశం తన 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లు ola electric s1. s1 pro దేశంలో విడుదల చేసింది. ఇది ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.Ola S1 Electric scooter మోడ‌ల్ ధ‌ర(గుజ‌రాత్‌లో) రూ .79,999. అలాగే S1 ప్రో ధ‌ర రూ.1,09,999. గుజ‌రాత్‌లోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంది. మిగ‌తా రాష్ట్రాల్లో ఓలా ఎస్ 1 ధర రూ.99,999. అలాగే ఓలా S...
Skellig Lite e-cycle విడుద‌ల‌

Skellig Lite e-cycle విడుద‌ల‌

Electric cycles
GoZero కంపెనీ ఇండియాలో ఓ ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను లాంఛ్ చేసింది. Skellig Lite e-cycle పేరుతో విడుద‌ల చేసిన ఈ సైకిల్ ధ‌ర రూ.19,999 వద్ద ప్రారంభ‌మ‌వుతుంది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ధ‌ర‌లో ల‌భించే ఎల‌క్ట్రిక్ సైకిల్‌గా నిలిచిందని చెప్ప‌వ‌చ్చు. Skellig Lite e-cycle స్పెసిఫికేష‌న్స్‌ గోజీరో సైకిల్ 25 కి.మీ రేంజిని క‌లిగి ఉంటుంది. గంట‌కు గరిష్టంగా 25 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. Skellig Lite e-cycle లో డిటాచ‌బుల్ ఎనర్‌డ్రైవ్ 210 Wh లిథియం బ్యాటరీ ప్యాక్ ను వినియోగించారు. ఇక వెనుక చ‌క్రానికి 250 W వెనుక హబ్-డ్రైవ్ మోటార్‌తో ఇది శ‌క్తిని పొందుతుంది. GoZero డ్రైవ్ కంట్రోల్ 2.0 LED డిస్‌ప్లే యూనిట్ ద్వారా నియంత్రించబడుతుంది. ఇందులో మూడు పెడల్-అసిస్ట్ మోడ్‌లను ఎంచుకునే ఆప్ష‌న్లు ఉన్నాయి. ఇందులోని బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి కేవలం 2.5 గంటలే పడుతుంది. లైట్‌లో 26 × 1.95 టైర్లు, ప్రత్యేకమైన V- బ్రేక్‌ల...