హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..
Bharat Mobility Global Expo 2025 : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి, హ్యుందాయ్ క్రెటా, అయితే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్ (Hyundai Creta Electric ) ఈరోజు విడుదల కానుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ విడుదల తర్వాత ఇప్పుడు , 'క్రెటా' బ్రాండ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వంటి మల్టీ పవర్‌ట్రైన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.భారతదేశంలో 2015లో ప్రారంభమైనప్పటి నుంచి హ్యుందాయ్ క్రెటా బాబాగా పాపులర్ అయింది. దేశంలో 11,00,000 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు గణంకాలు చెబుతున్నాయి. 10,00,000 యూనిట్లను దాటిన మూడు SUVలలో ఇదీ ఒకటి. మిగతా రెండు మారుతి సుజుకి బ్రెజ్జా, మహీంద్రా స్కార్పియో కూడా బాగా ప్రజాదరణ పొందాయి.క్రెటా డబ్బుకు విలువ ఇచ్చే కారుగా గుర్తింపు పొందింది. అందుబాటు ధరలో అనేక ఫీచర్లతో వస్తుంది. అనేక పవర్‌ట్రె...