Electric PV sales in 2023: అమ్మకాల్లో దుమ్ము రేపిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
Electric PV sales in 2023: ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు CY2023లో గరిష్ట స్థాయిలో 81,870 యూనిట్లకు చేరుకున్నాయి, దీని ఫలితంగా పెరిగిన ఉత్పత్తి లభ్యత, వినియోగదారుల డిమాండ్.. విస్తరిస్తున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితరాంశాలు అమ్మకాలకు ఊతమిచ్చాయి. ఇందులో టాటా మోటార్స్ 73% మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో MG మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా ఉన్నాయి. లగ్జరీ కార్ల తయారీదారులు 2,582 యూనిట్లను విక్రయించారు, సంవత్సరానికి 355% వృద్ధి చెందారు.Four wheelers ఇ-మొబిలిటీకి పెరుగుతున్న మార్పుకు సూచనగా మన రోడ్లపై electric SUVలు, సెడాన్‌లు ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో పెరిగాయి.ఈ కదలిక రిటైల్ అమ్మకాల్లో ప్రతిబింబిస్తుంది. వాహన్ ప్రకారం, CY2023 12 నెలల్లో మొత్తం 81,870 ఎలక్ట్రిక్ కార్లు, SUVలు, MPVలు అమ్ముడయ్యాయి. గతేడాది కంటే - 43,613 యూనిట్లు ఎ...