TVS ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లు
jio bp తో TVS Motor ఒప్పందం
దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాల కోసం బలమైన పబ్లిక్ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి TVS Motor Company, Jio-bp ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రతిపాదిత ఒప్పదం ప్రకారం టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లు Jio-bp యొక్క విస్తృతమైన ఛార్జింగ్ నెట్వర్క్ను వినియోగించుకునే అవకాశం పొందుతారు. ఇది ఇతర EVలకు కూడా అందుబాటులో ఉంటుంది.TVS Motor కంపెనీ భారతదేశపు ప్రముఖ ద్విచక్రవాహన, త్రీ-వీలర్ తయారీదారులలో ఒకటి. Jio-bp అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అలాగే bp (బ్రిటీష్ పెట్రోలియం) సంస్థల ఏర్పరచుకున్న మొబిలిటీ జాయింట్ వెంచర్. ఈ రెండు కంపెనీలు సాధారణ AC ఛార్జింగ్ నెట్వర్క్, DC ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ని సృష్టించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం.“ఇది jio bp మరియు VS Motor వారి వినియోగదారులకు విస్తారమైన, నమ్మదగిన ఛార్జింగ్ సౌకర్...