jio bp తో TVS Motor ఒప్పందం
దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాల కోసం బలమైన పబ్లిక్ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి TVS Motor Company, Jio-bp ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రతిపాదిత ఒప్పదం ప్రకారం టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లు Jio-bp యొక్క విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే అవకాశం పొందుతారు. ఇది ఇతర EVలకు కూడా అందుబాటులో ఉంటుంది.
TVS Motor కంపెనీ భారతదేశపు ప్రముఖ ద్విచక్రవాహన, త్రీ-వీలర్ తయారీదారులలో ఒకటి. Jio-bp అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అలాగే bp (బ్రిటీష్ పెట్రోలియం) సంస్థల ఏర్పరచుకున్న మొబిలిటీ జాయింట్ వెంచర్. ఈ రెండు కంపెనీలు సాధారణ AC ఛార్జింగ్ నెట్‌వర్క్, DC ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ని సృష్టించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం.
“ఇది jio bp మరియు VS Motor వారి వినియోగదారులకు విస్తారమైన, నమ్మదగిన ఛార్జింగ్ సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో ఈ ఒప్పదం కుదిరిందని టీవీఎస్ మోటార్ తన అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది.
TVS iQube
టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఎలక్ట్రిక్ టూ-వీలర్ పోర్ట్‌ఫోలియోలో టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే ఉంది. ప్రారంభించినప్పటి నుంచి TVS iQube 12,000 యూనిట్లు ఇప్పటికే విక్రయించారు. అంతేకాకుండా కంపెనీ EV వ్యాపారం కోసం రూ.1,000 కోట్లను పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా 5-25kW శ్రేణిలో రెండు, మూడు-చక్రాల వాహనాలను సిద్ధం చేస్తున్నామని, ఇవన్నీ రాబోయే 24 నెలల్లో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు TVS మోటార్స్ తెలిపింది.
Jio-bp pulse
Jio-bp దాని EV ఛార్జింగ్, swapping stations లను ‘Jio-bp pulse’ బ్రాండ్ క్రింద నిర్వహిస్తోంది. Jio-bp pulse యాప్‌తో, కస్టమర్‌లు సమీపంలోని స్టేషన్‌లను కనుగొని వారి Electric Vehicles ను ఛార్జ్ చేయగలరు. ఎలక్ట్రిక్‌లో ఒక అడుగు ముందుకు వేయాలని ఆకాంక్షించే ద్విచక్ర, మూడు చక్రాల వినియోగదారుల మధ్య దేశంలో EV అడాప్షన్‌ను పెంచడం ఈ భాగస్వామ్యం లక్ష్యంగా కంపెనీ పేర్కొంది.
Stay tuned with Harithamithra for more EV updates and also subscribe to our YouTube channel for the latest EV news and reviews.
One thought on “TVS ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లు”