
40 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన Kinetic DX – ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ సిద్ధం
Kinetic DX Electric Scooter లాంచ్: ఫీచర్లు, ధరలు, బుకింగ్ వివరాలు ఇవేKinetic DX Electric Scooter | దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కైనెటిక్ DX ఎట్టకేలకు తిరిగి వచ్చింది. కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (KEL) కు చెందిన EV తయారీ అనుబంధ సంస్థ అయిన పూణేకు చెందిన కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ లిమిటెడ్ (KWV), పూర్తిగా ఎలక్ట్రిక్ అవతార్ (Electric two-wheeler)లో ఐకానిక్ కెనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తిరిగి తీసుకువచ్చింది.1984 లో పెట్రోల్ స్కూటర్‌గా వచ్చిన కెనెటిక్ హోండా భారతదేశంలో సెల్ఫ్-స్టార్ట్ ఇగ్నిషన్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించిన మొట్టమొదటి స్కూటర్. అయితే దీని పూర్తి-ఎలక్ట్రిక్ రూపంలో, కైనెటిక్ DX రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. DX, DX+ ధర వరుసగా రూ. 1,11,499, రూ. 1,17,499 (ఎక్స్-షోరూమ్).కైనెటిక్ కొత్త DX ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లను రూ. 1,000 టో...