220కి.మి రేంజ్‌తో Komaki DT 3000 electric scooter
Komaki DT 3000 electri oic scooter:
Komaki కంపెనీ మార్చి 25న తన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Komaki DT 3000 ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180-220 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. .
ఈ స్కూటర్ ను ప్రారంభించిన నాటి నుంచి అన్ని Komaki డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉండనుంది. దీని ధర సుమారు రూ.1.15లక్షలు (. ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుందని అంచనా కాగా Komaki DT 3000 చిత్రాలను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు.
గంటకు 90కి.మి వేగం
Komaki కంపెనీ ఈ సంవత్సం రేంజర్, వెనీషియన్ మోడళ్లను లాంచ్ చేసిన తర్వాత మూడవ మోడల్ DT 3000న కూడా లాంచ్ చేస్తోంది. ఈ కొత్త ఇ-స్కూటర్‌లో శక్తివంతమైన 3000 W BLDC మోటార్, పేటెంట్ పొందిన 62V52AH అధునాతన లిథియం బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180-220 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని, గరిష్టంగా 90 కిమీ/గం వేగాన్ని కలిగి ఉంటుందని క...