దేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ largest floating solar power plant
అబ్బురపరిచే విశేషాలు తీని సొంతం
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటుlargest floating solar power plant : భారతదేశంలోనే యొక్క అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ (ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్) ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంజనీరింగ్ తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL).. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రామగుండం రిజర్వాయర్‌లో దీనిని నిర్మించింది. 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు రామగుండం రిజర్వాయర్‌లో 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని కోసం రూ.423 కోట్లు వెచ్చించారు.ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ (తేలియాడే సోలార్ ప్లాంట్)ను "ఫ్లోటింగ్ సోలార్", "ఫ్లోటింగ్ ఫోటోవోల్టాయిక్స్" (FPV) లేదా "ఫ్లోటోవోల్టాయిక్స్" అని కూడా పిలుస్తారు. ఇవి సాధారణంగా చెరువులు, సరస...