Palm Oil | పామాయిల్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
Palm Oil | హైదరాబాద్ : పామాయిల్ రైతులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పామ్ ఆయిల్ రైతులకు ఊరటనిచ్చేలా ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచింది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. దిగుమతి సుంకం పెంపుతో పామాయిల్ రైతుల ( Palm Oil Farmers )కు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.14,392గా ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇది టన్నుకు రూ.1,500 నుంచి రూ.1,700 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఒక్కో ఆయిల్ పామ్ గెల ధర రూ.16,500గా పెరగనుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 44,400 ఎకరాల పామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి. ఇం...