Home » Palm Oil | పామాయిల్‌ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Palm Oil | పామాయిల్‌ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Palm Oil
Spread the love

Palm Oil | హైదరాబాద్‌ : పామాయిల్‌ రైతులకు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. ఈ పామ్ ఆయిల్‌ రైతులకు ఊరటనిచ్చేలా ముడి పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని పెంచింది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ‌న్య‌వాదాలు తెలిపారు. దిగుమతి సుంకం పెంపుతో పామాయిల్‌ రైతుల ( Palm Oil Farmers )కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.14,392గా ఉంది. కేంద్రం తాజా నిర్ణ‌యంతో ఇది టన్నుకు రూ.1,500 నుంచి రూ.1,700 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఒక్కో ఆయిల్‌ పామ్‌ గెల ధర రూ.16,500గా పెరగ‌నుంద‌ని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

తెలంగాణ‌ రాష్ట్రంలో ప్రస్తుతం 44,400 ఎకరాల పామ్‌ ఆయిల్‌ తోటలు ఉన్నాయి. ఇందులో 2.80 లక్షల టన్నుల ఆయిల్‌పామ్‌ గెలలు దిగుబడి వ‌స్తోంది. కేంద్ర స‌ర్కారు తాజా నిర్ణయంతో రాష్ట్రంలో పామాయిల్‌ సాగువైపు రైతులు మొగ్గు చూపే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు రైతులు కూడా పామాయిల్‌ సాగు పెద్ద ఎత్తున‌ చేపట్టాలని మంత్రి తుమ్మల కోరారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *