1960’s లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ లాంబ్రెట్టా.. మళ్లీ వస్తోంది..
Lambretta భవిష్యత్తులో భారత మార్కెట్‌కు తిరిగి వస్తుందా..?
Lambretta Elettra Scooter: బజాజ్ చేతక్ రాక ముందు ఓ ఊపు ఊపిన స్కూటర్ మీకు గుర్తుందా..? 1960, 1970 లలో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ బ్రాండ్ లాంబ్రెట్టా (Lambretta).. ఆ కాలంలో ఈ స్కూటర్ చాల పాపులర్. అయితే ఆ తర్వాత ఆధునిక మోడళ్లు,, స్వదేశీ స్కూటర్ల రాకతో భారతదేశంలో ఈ ఇటాలియన్ బ్రాండ్ క్రమేనా కనుమరుగై పోయిది. అయినప్పటికీ, లాంబ్రెట్టా బ్రాండ్ ఐరోపా మార్కెట్లలో ద్విచక్ర వాహన రంగంలో బలమైన కంపెనీ గా కొనసాగింది. ఆటోమొబైల్ రంగం ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మారుతుండడంతో.. లాంబ్రెట్టా కూడా ఈవీ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటలీలో కొనసాగుతున్న EICMA 2023 ఎక్స్ పో లో లాంబ్రెట్టా తన మొదటి బ్యాటరీతో నడిచే మోడల్‌ను పరిచయం చేసింది. లాంబ్రెట్టా తన మొదటి ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ప్రదర్శించడం ద్వారా ఆటోమొబైల్ వర్...