Home » 1960’s లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ లాంబ్రెట్టా.. మళ్లీ వస్తోంది..

1960’s లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ లాంబ్రెట్టా.. మళ్లీ వస్తోంది..

lambretta elettra electric scooter launch date
Spread the love

Lambretta భవిష్యత్తులో భారత మార్కెట్‌కు తిరిగి వస్తుందా..?

Lambretta Elettra Scooter: బజాజ్ చేతక్ రాక ముందు ఓ ఊపు ఊపిన స్కూటర్ మీకు గుర్తుందా..? 1960, 1970 లలో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ బ్రాండ్ లాంబ్రెట్టా (Lambretta).. ఆ కాలంలో ఈ స్కూటర్ చాల పాపులర్. అయితే  ఆ తర్వాత ఆధునిక మోడళ్లు,, స్వదేశీ స్కూటర్ల రాకతో భారతదేశంలో ఈ ఇటాలియన్ బ్రాండ్ క్రమేనా కనుమరుగై పోయిది. అయినప్పటికీ, లాంబ్రెట్టా బ్రాండ్ ఐరోపా మార్కెట్లలో ద్విచక్ర వాహన రంగంలో బలమైన కంపెనీ గా కొనసాగింది. ఆటోమొబైల్ రంగం ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మారుతుండడంతో.. లాంబ్రెట్టా కూడా ఈవీ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటలీలో కొనసాగుతున్న EICMA 2023 ఎక్స్ పో లో లాంబ్రెట్టా తన మొదటి బ్యాటరీతో నడిచే మోడల్‌ను పరిచయం చేసింది.  లాంబ్రెట్టా తన మొదటి ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ప్రదర్శించడం ద్వారా ఆటోమొబైల్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు Elettra..అనే పేరు పెట్టింది కంపెనీ..

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Lambretta Elettra Scooter స్టైల్

Lambretta Elettra Scooter ఇప్పటికీ కాన్సెప్ట్‌ దశలో ఉంది. కంపెనీ దీనిని ఉత్పత్తి దశకు తీసుకువెళ్లనున్నట్లు హామీ ఇచ్చింది. లాంబ్రెట్టా నుంచి వచ్చిన Li-150 సిరీస్ 2తో సహా మునుపటి మోడల్‌ల నుంచి సిగ్నేచర్ డిజైన్ నే కొత్తగా వచ్చిన Lambretta Elettraలో ఇది నిస్సందేహంగా 21వ శతాబ్దపు స్కూటర్ గా నిలవనుంది.

Lambretta-Elettra price details

సింగిల్ చార్జిపై 127 కి.మీ రేంజ్

ఇతర విజువల్ హైలైట్‌లలో ‘హుక్డ్’ హెడ్‌ల్యాంప్ వలె ‘రిట్రాక్టబుల్’ బ్రేక్ లివర్‌లను కవర్ చేసే హ్యాండిల్ బార్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉన్నాయి. రిమోట్ బటన్‌ను నొక్కి మొత్తం సీట్ ను పైకి ఓపెన్ అవుతుంది. దీంతో బ్యాటరీని కలిగి ఉన్న కంపార్ట్‌మెంట్‌కు యాక్సెస్ చేయవచ్చు. ఇందులోనే హెల్మెట్ కంపార్ట్‌మెంట్ ఉంటుంది. లాంబ్రెట్టా ఎలెట్ట్రా స్పెక్స్స్కూటర్‌కు 11kW (15 hp) ఎలక్ట్రిక్ మోటారు, ఇది 4.6 kWh బ్యాటరీ ప్యాక్ నుండి శక్తిని పొందుతుంది. ఇందులో మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి- ఎకో, రైడ్ తోపాటు స్పోర్ట్. ఎకో మోడ్‌లో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 127 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని లాంబ్రెట్టా పేర్కొంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

గంటకు 110 కి.మీ వేగం

Elettra గరిష్టంగా 110 kmph వేగంతో దూసుకుపోతుంది. 220V హోమ్ ఛార్జర్‌తో బ్యాటరీని 5 గంటల 30 నిమిషాలలోపు ఛార్జ్ చేయవచ్చు. పబ్లిక్ ప్లేస్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించడం ద్వారా, కేవలం 35 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించబడిన ఎలెట్ట్రా సిగ్నేచర్ ట్రైలింగ్ లింక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపున మోనో-షాక్‌పై ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికొస్తే ముందు వెనుక ఒకే డిస్క్ సెటప్ ద్వారా నిర్వహించబడతాయి.

లాంబ్రెట్టా స్కూటర్ చరిత్ర ఇదీ..

lambretta history in india : లాంబ్రెట్టా స్కూటర్ ను 1950లలో ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా (API) భారతదేశంలో మొదటిసారిగా అసెంబుల్ చేశారు . కంపెనీ 48 cc స్కూటర్ తో ప్రారంభించబడింది, తరువాత 1976 వరకు భారతదేశంలో విక్రయించబడిన Li150 సిరీస్ 2 మోడల్ కు లైసెన్స్ ను పొందింది.
API ప్రారంభంలో ఇటలీ నుంmr రవాణా చేయబడిన భాగాలను సమీకరించి ఆపై వాటిని వారి స్వంత ఫ్యాక్టరీలలో అసెంబుల్ చేసింది. లాంబ్రెట్టాను ఫెర్డినాండో ఇన్నోసెంటి స్థాపించారు,
1980లలో జపనీస్ కంపెనీకి చెందిన మోటార్ సైకిళ్లతో పాటు bajaj chetak, lml vespa వంటి స్కూటర్లు భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించడంతో లాంబ్రెట్టా బ్రాండ్ క్రమంగా అమ్మకాల్లో వెనుకబడిపోయింది.
అయినప్పటికీ, ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో “పాతకాలపు రిచ్ లుక్”తో భారతదేశంలో తిరిగి రావాలని కంపెనీ భావిస్తోంది

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *