
Indira Mahila Dairy | మహిళలకు సబ్సిడీపై 2 పాడి పశువుల పంపిణీ
ఇందిర డెయిరీతో ఏడాదికి రూ.24 కోట్లు మహిళలకు ఆదాయంIndira Mahila Dairy | దేశం మన వైపు చూసేలా ఇందిరా మహిళా డెయిరీ విజయం సాధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ఆకాంక్షించారు. మధిర(Madhira)లో ఇందిరా డెయిరీ లోగో ఆవిష్కరించి మహిళా సంఘాల సభ్యులతో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి తోడు రైతలు పాడి పరిశ్రమతో ఆదాయాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఆ ఆలోచనతోనే ఇందిరా మహిళా మహిళా డెయిరీ(Indira Mahila Dairy)ను 2011లో రూపకల్పన చేశామని తెలిపారు. స్వశక్తి మహిళా సంఘాలచే పాడి పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మహిళలకే పాడి పశువులు అందించి, పాల సేకరణ నుంచి ప్యాకింగ్, బై ప్రోడక్ట్ (వెన్నె, మజ్జిగ, పెరుగు, నెయ్యి, స్వీట్స్) ఉత్పత్తి, మార్కెటింగ్ చేసి లాభాలు పొందాలని చెప్పారు. ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు కోసం 9.5 ఎకరాల స్థలం సేకరించి ...