
low Cost EV | అత్యాధునిక అమరాన్ బ్యాటరీతో రూ.69,999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
low Cost EV Scooter | BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ LOEV+ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా విడుదల చేసింది. ఇందులో మూడు సంవత్సరాల వారంటీతో అమరాన్ 2kWh బ్యాటరీని వినియోగించారు. ఇది గంటకు 60 km/h వేగంతో ప్రయాణిస్తుంది. ₹69,999 (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన ఈ వాహనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.BattRE స్కూటర్ లో IP67-రేటెడ్ బ్యాటరీని ఉపయోగించారు. ఫుల్ ఛార్జింగ్ కావడానికి 2 .50 గంటల సమయం పడుతుంది. ఇది వివిధ మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది:ఎకో మోడ్‌లో 90 కిమీ (35 కిమీ/గం),కంఫర్ట్ మోడ్‌లో 75 కిమీ (48 కిమీ/గం),స్పోర్ట్స్ మోడ్‌లో 60 కిమీ (60 కిమీ/గం).low Cost EV : సేఫ్టీ, స్మార్ట్ ఫీచర్స్..ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే.. కంబైన్డ్ డిస్క్-బ్రేక్ సిస్టమ్, 180mm గ్రౌండ్ క్లియరెన్స్, పార్కింగ్ స్విచ్, సారీ గార్డ్ ఉన్నా...