ఈవీ మొబిలిటీ కోసం Mahindra Electric కొత్త ఒప్పందం
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ ఆటోమెబైల్ దిగ్గజం కొత్త ప్రణాళికతో ముందుకు వస్తోంది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ( Mahindra Electric Mobility Ltd – MEML) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంచేందుకు, ఈవీ మొబిలిటీని పెంచేందుకు కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) అనే ప్రభుత్వ సంస్థతో కలిసి పనిచేయనుంది. ఈ సంస్థలు గ్రామీణ మార్కెట్‌లోని వినియోగదారులకు మహింద్రా యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు ట్రియో, ఆల్ఫా మోడళ్లను అందిస్తుంది.ఈవీలపై అవగాహన కోసం ..
ఈ ప్రక్రియను ప్రారంభించడానికి గానూ CSC.. గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలను (VLE -Village Level Entrepreneurs) నియమిస్తుంది. వీరు ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు , అవగాహనను సులభతరం చేయడంలో సహాయపడతారు. వారు కస్టమర్‌లు, ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల (OEM – o...