
Electric Three-Wheelers అమ్మకాల్లో మహింద్రా దూకుడు
Electric Three-Wheeler అమ్మకాల్లో మహింద్రా దూకుడు Electric Three-Wheelers (ఎలక్ట్రిక్ త్రీవీలర్ ) అమ్మకాల్లో మహీంద్రా గ్రూప్ దూకుడు ప్రదర్శిస్తోంది. లాస్ట్ మైల్ మొబిలిటీ విభాగంలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) ఈ నెలలో 50,000 ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్ల మైలురాయిని దాటింది. మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్రయాణాన్ని 2017లో ఇ ఆల్ఫా మినీతో ప్రారంభించింది. ఆ తర్వాత ట్రియో, ట్రియో యారీ, ట్రియో జోర్, ఈ ఆల్ఫా కార్గోలను విజయవంతంగా ప్రారంభించింది. విక్రయించిన అన్ని ఎలక్ట్రిక్ మహీంద్రా 3-వీలర్లలో, ట్రియో శ్రేణి ఎంతో సక్సెస్ తోపాటు అవార్డులను సొంతం చేసుకుంది. 2019 సంవత్సరపు ఎలక్ట్రిక్ 3-వీలర్, మేడ్-ఇన్-ఇండియా ఇన్నోవేషన్ కోసం ఆటో రిటైల్ మార్కెటింగ్‌లో గ్లోబల్ అవార్డ్స్ వరించాయి.ఈ విషయమై మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) సీఈవో సుమన్ మిశ్ర...