
Green India Challenge | సుందర్‌బన్స్‌లో మడ అడవుల పెంపకం
సుందర్‌బన్స్ గోసాబాలో 2,000 మడ మొక్కల నాటింపుతుఫానులు, ప్రకృతివిపత్తుల నుంచి రక్షణతో పాటు జీవనోపాధి కల్పనఉమాశంకర్ మండల్ స్ఫూర్తిగా – 20 ఏళ్లుగా తీర ప్రాంతాల పునరుద్ధరణకు కృషిGreen India Challenge | 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు నూతన దిక్సూచి అవుతోంది. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్(Sundarbans)లో 2,000 మడ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సముద్ర తుఫానుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) ప్రేరణ కాగా, ఉమాశంకర్ మండల్ (Uma Shankar Mandal) ఆధ్వర్యంలో ఇది మరింత మరింత ముందుకు సాగుతోంది.ఆదివారం ఎనిమిదవ ఎడిషన్‌లో భాగంగా, Green India Challenge పుర్బాషా ఎకో హెల్ప్‌లైన్ సొసైట...