Maruti Suzuki Elecric car | మారుతి ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడు? పూర్తి వివరాలు ఇవే..
Maruti Suzuki Elecric car | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ Maruti Suzuki.. తమ మొదటి EV,eVX ఎలక్ట్రిక్ కారును 2025 ఆర్థికసంవత్సరంలో భారత మార్కెట్‌లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. eVXతోపాటు Toyota వెర్షన్‌ను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేయబడతాయి గతంలొఅక్టోబర్ 2024 ప్రారంభిస్తారని వార్తలు రాగా తాజాగా 2025 ప్రారంభంలో ధర ప్రకటన విడుదల చేయనుననట్లు మారుతి సుజుకీ అధికారులు ధ్రువీకరించారు.మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ వ్యవహారాలు), రాహుల్ భారతి మాట్లాడుతూ.. "మా మొదటి EV ఒక SUV.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (FY2024-2025) ప్రారంభించబడుతుంది. ప్రస్తుతం హన్సల్‌పూర్‌లోని SMG ఫెసిలిటీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి – A, B మరియు C. ఇప్పుడు, EVని తయారు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు."మా EV కాన్సెప్ట్ కారు ఇప్పటికే ఆవిష్కరించాం. ఇది 550km పరిధి, 60kWh బ్యాటరీని కలిగి ఉ...