Hybrid Cars| 40 కి.మీ మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ కార్లు వచ్చేస్తున్నాయి.. ఫీచర్లు ఇవే..
Maruti Fronx Hybrid: డీజిల్ కార్లు కరుమరుగు కాబోతున్నాయి.. పెట్రోల్ కార్లు, CNG, ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం మార్కెట్ లో రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు వీటికి గట్టి పోటీనిచ్చేందుకు హైబ్రిడ్ (Hybrid Cars) వచ్చింది. ఇది ప్రాథమికంగా ICE ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారు ద్వారా ఉత్పత్తి చేసిన ఎనర్జీ శక్తి మిశ్రమం. భారత్ లోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇప్పటికే చాలా సెగ్మెంట్లలో తన ఉనికిని చాటుకుంది. 2020 ఏప్రిల్ లో డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత, మారుతి పెట్రోల్, CNG పోర్ట్‌ఫోలియోపై ఎక్కువగా దృష్టిసారించింది. కంపెనీ నుంచి చాలా CNG కార్లు వచ్చాయి. మరోవైపు, ఎలక్ట్రిక్ విభాగంలో మారుతి కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ SUV మారుతి eVX ను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీంతో పాటు, మారుతి సుజుకీ.. హైబ్రిడ్ విభాగంలో కూడా పైచేయి సాధించాలన చూస్తోంది.Autocar నివేదిక ప్రకారం....