టెస్టింగ్ దశలో MG Comet EV
MG సంస్థ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ వాహనం MG Comet EV భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది ఇప్పుడు గురుగ్రామ్ (Gurugram) లో ఈ వాహనాన్ని పరీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.
Comet EV స్పెసిఫికేషన్స్..
Comet EV ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనం. దీని ధర సుమారు రూ. 10 లక్షలు ఉండవచ్చు. భారతదేశంలో టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3 లకు గట్టిపోటీ ఇవ్వనుంది. కామెట్ EV అనేది వులింగ్ ఎయిర్ EV రీబ్యాడ్జ్ వెర్షన్. ఇది భారతదేశంలో MG కంపెనీకి సంబంధించి రెండవ పూర్తి ఎలక్ట్రిక్ వాహనంగా నిలవనుంది. ఇది భారతదేశంలో ఏప్రిల్ 2023లో ప్రారంభిస్తారని భావిస్తున్నారు.MG కామెట్ 25kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. 38 bhp ఎలక్ట్రిక్ మోటారుతో ముందు చక్రాలను ఎనర్జీని ఇస్తుంది. . కాంపాక్ట్ ఈ వాహనాన్ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కిమీ మైలేజీని క్లెయిమ్ చే...