సరికొత్త ఫీచర్ల తో Wuling Air EV

Wuling Air EV
Spread the love

ఆల్టో కంటే చిన్న ఎల‌క్ట్రిక్ కారు

Wuling Air EV  : MG మోటార్ భారతదేశంలో హెక్టర్, హెక్టర్ ప్లస్, ZS EV, గ్లోస్టర్ కొత్తగా ప్రారంభించిన ఆస్టర్‌తో కొంత విజయాన్ని సాధించింది. కానీ ఇప్పుడు MG ట‌ర్న్ తీసుకుంటోంది. భారతదేశంలో ఇప్ప‌టి వ‌రకు ఎవరూ తయారు చేయని ప్రోడ‌క్ట్ పై ప‌నిచేస్తోంది. అదే. మైక్రో EV సెగ్మెంట్., మహీంద్రా వంటి బడా కంపెనీలు e2O, e2O ప్లస్ అనే రెండు వాహనాలతో ఈ విభాగంలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ పూర్తిగా విజ‌యం సాధించ‌లేకపోయాయి.
ప్ర‌స్తుత మార్కెట్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మైక్రో EVలు తిరిగి రావడానికి ఇది స‌రైన సమయం. MG కంపెనీ భారతదేశంలో బలమైన EV నేపథ్యాన్ని కలిగి ఉంది. ఈ కంపెనీ MG ZS EVని విడుద‌ల చేసింది. ఇప్పుడు, కొత్త MG ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి రెండు తలుపులు మాత్రమే ఉన్నాయి. ఆల్టో కంటే పరిమాణంలో చిన్నగా ఉంటుంది.

Wuling Air EV

Range 300km/charge

MG మైక్రో ఎల‌క్ట్ర‌క్ కారుకు E230 అనే సంకేతనామం ఉంది. వాస్తవానికి వారి GSEV (గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్) ప్లాట్‌ఫారమ్ ఆధారంగా జాయింట్ వెంచర్ SAIC-GM-వులింగ్ ద్వారా తయారు చేయబడిన వులింగ్ ఎయిర్ EV. ఇది జూన్‌లో ఇండోనేషియాలో ఆవిష్కరించబడింది. MG దీన్ని భారతదేశంలో కూడా ప్రారంభించాల‌ని భావిస్తోంది. Wuling Air EV 2 వేరియంట్‌లను కలిగి ఉంది. మొద‌టిది SWB (స్టాండర్డ్ వీల్ బేస్) 2599 mm పొడవు, రెండోది LWB (లాంగ్ వీల్ బేస్) పొడవు 2974 mm.. ఇవి రెండూ 1505 mm వెడల్పు, 1631 mm పొడవు ఉంటాయి. SWBకి రెండు సీట్లు మాత్రమే ఉండ‌గా LWBకి 4 సీట్లు ఉన్నాయి. వులింగ్ ఎయిర్ EV రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలు ఉన్నాయి. అందులో మొద‌టిది 30kW, రెండోది 50 kW పవర్ మోటార్. ఇవి ఒకే ఛార్జ్‌పై వ‌రుస‌గా 200km నుండి 300km వరకు రేంజ్‌ల‌ను ఇస్తాయి. ఇక వీటి ధరలు IDR 250 మిలియన్లు (రూ. 13.2 లక్షలు), రెండోది IDR 300 మిలియన్లు (రూ. 15.9 లక్షలు).

One Reply to “సరికొత్త ఫీచర్ల తో Wuling Air EV”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *