Irrigation | వ్యవసాయంలో నీటిపారుదల ఖర్చులను ఇలా తగ్గించుకోండి..
Irrigation | దేశంలోని చాలా రాష్ట్రాల్లో అన్నదాతలను నీటికొరత వేధిస్తోంది. బోర్లు ఎండిపోయి, జలాశయాలు ఇంకిపోయి పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో రైతులు అప్పులపాలై కూనారిల్లిపోతున్నారు. అయితే వ్యవసాయంలో నీటిపారుదల చాలా కీలకం.. సాగు పెట్టుడిలో అతిపెద్ద ఖర్చులలో ఇది కూడా ఒకటి. నీటిపారుదల, నీటి నిర్వహణకు సంబంధించి ఖర్చులు చాలా ఉంటాయి. బావులు, కాలువలు, ట్యాంకులు లేదా చెరువుల నుండి నీటిని సేకరించడం, నీటిని పంపింగ్ చేయడానికి విద్యుత్ లేదా డీజిల్‌పై రైతులు ఖర్చు చేస్తుంటారు.ఎకరానికి నీటిపారుదల, నీటి నిర్వహణ ఖర్చులు ప్రతి పంటకు నీటి డిమాండ్, దాని కరెంటు యూనిట్ ధరపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గోధుమలకు, భౌగోళిక స్థితిని బట్టి హెక్టారుకు 13,000 క్యూబిక్ మీటర్ల నుండి 20,000 క్యూబిక్ మీటర్ల నీటి అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు నీటిపారుదల ఖర్చులను తగ్గించుకోగలిగితే, అది మరింత పొదుపు మరియు లాభం పెరుగుతుం...