ప్రపంచంలోనే అత్యధిక రేంజ్‌తో Simple One electric scooter
దేశ స్వాంత్ర్య దినోత్సవం రోజున వాహన రంగంలో రెండు అద్భుత ఆవిష్కరణలు జరిగాయి. అందులో ఒకటి ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఓలా ఎస్1, ఓలా ఎస్ 1 ప్రో ఈ-స్కూటర్లను విడుదల చేయగా.. సింపుల్ ఎనర్జీ కంపెనీ Simple One electric scooter ను లాంచ్ చేసింది. ఈ రెండు స్కూటర్‌లు అంచనాలకు మించి అత్యాధునిక ఫీచర్లతో ముందుకు వచ్చాయి. టాప్ స్పీడ్, రేంజ్ విషయంలో ఓలా కంటే సింపుల్ వన్ స్కూటర్ పైచేయి సాధించింది.బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన మొట్టమొదటి ప్రోడక్ట్ అయిన Simple One electric scooter ను ఆగస్టు 15న ప్రారంభించింది. దీని ధర రూ .1,09,999 (ఎక్స్-షోరూమ్, FAME II సబ్సిడీకి ముందు). ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చే రెండు నెలల్లో 13 రాష్ట్రాల్లోని 75 నగరాల్లో అందుబాటులో ఉంటుందని సింపుల్ ఎనర్జీ సంస్థ పేర్కొంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ఈ స్కూటర్ రేంజ్ ఇప్పటిరకు అత్యధిక...