ఇండియాలో అత్యంత తక్కువ ధరల్లో లభ్యమయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
best budget electric car in india : మహానగరాల్లో సంప్రదాయ పెట్రోల్ వాహనాల వినియోగం మితిమీరిపోవడంతో వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. కొద్దిరోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం భారీ స్థాయికి చేరుకునేలా AQI తీవ్ర స్థాయిని దాటింది. దేశ రాజధాని ప్రాంతంలో తిరిగే BS-4 పెట్రోల్, BS-4 డీజిల్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీపావళి తర్వాత బేసి-సరి నిబంధనను అమలు చేయనున్నారు. నవంబర్ 13 నుంచి 20 వరకు ఈ నిబంధన ఉంటుంది. పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి ఒక మార్గం ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడం. దురదృష్టవశాత్తు.. EVల వినియోగం ఇప్పటికీ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అందువల్ల, మాస్ మార్కెట్లో ఈవీల ఎంపికలు పరిమితంగానే ఉన్నాయి. పర్యావరణానికి అనుకూలమైన జీరో ఎమిషన్ వెహికల్ని సొంతం చేసుకోవాలని ఆలోచించేవారి కోసం మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్ల గురించి పూర్తి సమాచారం...