Nissan Ariya EV | కొత్తగా నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు.. ఫుల్ ఛార్జ్ తో 500 కి.మీలు ప్రయాణించవచ్చు.. !
Nissan Ariya EV: భారత్ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలన్నీ కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెట్టాయి. అయితే నిస్సాన్ కంపెనీ కూా తన కొత్త ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి ముందు నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ప్రారంభించనుంది. దీని బుకింగ్ కూడా ప్రారంభించనుంది. నిస్సాన్ తన కొత్త EV అయిన నిస్సాన్ ఆరియా (Nissan Ariya EV)ను దేశంలో ప్రారంభించవచ్చు.నిస్సాన్ ఆరియా డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారు కూపే డిజైన్‌తో రూపొందించారు. మొదటి, వెనుక భాగంలో షోల్డర్ లైన్ కనిపిస్తుంది. ఇందులో కొత్త డిజైన్ షీల్డ్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే వెనుక భాగం కూడా దాని స్టైలిష్ గ్రిల్, బంపర్, హెడ్‌లైట్, టెయిల్‌లైట్‌తో చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు.
ఫీచర్లు..
కొత్త నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు 12...